వికాసం చిగురులో ఊరూజనం బతుకు గొప్పదేలే
చింతచిగురు కొమ్మ లేతగాలి ఊపేవేళ్ళు లేలేతరా
పాలపిట్ట వాలే చెట్ల దసరా మనిషి సరదా ఊరులే
మగతలో మమత వెతల జతలో బతుకు పల్లెజీవి
ఆషాఢ పాట ఢమాల్ ఊరు పిలువదు కొత్తల్లుల్ల
పప్పు ఉడకదు ఊరు గట్టిది మెతుకే పల్కు ఆకల్లే
తిప్పల్లేక చేతిపని ఆడు కడుపునింపే బువ్వుడికేలే
లీగల్ టెండర్ లేక పైస గీత లెక్కువయ్యె పల్లె క్రైడ్
కరోనా ఏడ్చే పల్లెపల్లె నో మాస్క్ చెట్టూగాలీ స్ప్రేనే
నేనూ నా కవిత ఊరొదలదు కొంత పాజ్ ఆరాంగా
కలం నిద్రపోదు పోనివ్వదు కాలాన్ని కవితే పల్లెరా
కిటికీ మూసుకోలే తెరిచేవుందా ఊరుబేల రాదని
నరుగుతో ఆటపరుగే పూలుతేలే ఊరే అందంనది
నుడిసడిపడి లేక దిమ్మరి ఏకాంతదారి ఊరే కోరేగ
అబ్బచెప్పు జబ్బేదైనా దెబ్బకు గాన్ ఊరే డాక్టర్
ఆకులు అలం తినే సాధు ఆకలిలేక బతికే ఫుల్
ఆమెచెప్పదు ఈమెవినదే తూర్పూపడమరఊరే
నోరుతెర్వదు మాటరాదు పల్లెబతుకు ఆగమాగం
నవ్విందీ నన్నూ నవ్వించింది గుండెల గుండెపల్లే
తొణకక బెణుకక సాగే బతుకు ఊరు నడిపే నన్నే
సవిత కవిత మమత సమత పేరెల్ల పల్కేపదపల్లె
==================================
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి