నాట్యాలెన్నో ప్రకృతి నేర్పే ఊరందాలు పూసే వేళ
ఆమని ఆటల తేలే పూట పల్లెల మంచు కురిసేనే
చెంగావిచీర ఊపే సింగారి ఊరు కనులే నా గీతం
గాలి తేలే ఆకుపచ్చ జండాలే నింగితాకే పల్లె నేను
పరుగే పరువం నగల సోయగం ఊరు విరిగంధం
వీచే చిరుగాలి పూచేపూలు ఊపిరి ఊరు త్రివేణి
చెట్టుకాత గోద ఈత పూబంతి నవ్వుల పల్లేజీవం
నిన్ను నీకుతెలిపే ఊరుమనసు చిగురు తీపి తీగ
విలోలమైన లోలకం అపసవ్యకేళి పల్లెజీవి బాధే
లోకం రంగుల రాట్నం పాకం కుదిరిన నాకం ఊరు
గొడవ లొల్లి గలాట లేనిదే ఊరు గడపల పరువు
ప్రేమలేదు పెళ్ళి ఓకే ఆపై ప్రేమ జీవనం పల్లెసీమల
ఊరుగుండె చెడుగుడు ఆడదు కబడ్డీ కూత ఊగు
అ ఆ అంటే ప్రీతి అలీ బే నేర్చే గొట్టు ఎబిసిడి పల్లె
ఇష్టంతో పనిలే వరసైతే చాలు తంతు విందే ఊరు
మనసున్నది సర్దుకో వదిలేమాట పూముళ్ళే పల్లే
బావా బావ పన్నీరు బావను పట్టుకు తన్నేలే బాల
వీసెడు గంధం పూసేరు వీధివీధి తిప్పేబంధం పల్లే
ఊరు కలిస్తే ఉబ్బు వీడితే ఎండేను బువ్వసంచి
మంచీ చెడు అన్నీ కడుపులోనే ఊరు మితభాషి
అన్నీచూసీ ఏమీతెలియనట్లు గొప్పలౌక్యం ఊరు
==================================
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి