ఊరుగాలి ఈల 94:- డా.టి.రాధాకృష్ణమాచార్యులు
ఏ అవసరాల్లేనిది పల్లె ఆదుకునేదీ ఊరే ఫైర్ వైర్
వాడూవీడూ కలిసే దూరందూరం ఊరే మైదానం
బండి రాదు బడిపోదు పల్లె పలకాబలపం మొండి

అదివద్దూ ఇదికూడదు పెద్దోళ్ళంతే పల్లెచెక్ మేట్స్
అన్నీ రుచిచూసిందే ఊరు బోధలేక  పెద్దెలాగో గో
కళ్ళు మూయదు నిద్రపోతది బాగా చూడ ఓటెస్ట్

తరుగదు పెరుగదు ఊరుప్రేమ స్టేబుల్ కాన్స్టెంట్
కథరాయలేరు చెబుతారు పల్లెజీవి  ట్రాంక్విల్డ్ ఐసీ
అమ్మ పాలమీగడ తమ్మిరగడ నేనే పాపం ఊరట

నోటికిభాష కంటికిసైగ కాలుకునడక పల్లె అందం
కొప్పడడు నవ్వడు వింతచింత నే ఊరు పోషణ
తరగనిసిరి ఉసిరి విటమిన్ సి రోగం తరిమే పల్లె

అమ్మో ఊరా రానని అనరు పదపోదాం పల్లెపాట
అందరం అక్కన్నుంచే చెప్ప నామోషీకాదది పల్లె
వేరు కనపడదు వాసనేస్తుంది పసిగట్టిట్టే ఊరోన్ని

మతలబు తెలీదు తారులేదు కంకరతారే ఊరు వే
సారంటే చదువమని ఎంతకోపమో పల్లెనవ్వే ఆపై
ఏ కళా అబ్బదు అందరికీ ఫ్రీనే ఇష్టం కష్టంపల్లెదేగా

కోడికూత లేపే పొలం పిలిచే పల్లె దరువు అడివే
అగ్గువకాదు నేటి పల్లె పట్టంపోకడే మనసేగట్టిది
తియ్యగ మాట కారంనోట వగుర్చుటే పల్లెవిద్యలే
====================================
(ఇంకా ఉంది)

కామెంట్‌లు