70.
నేరాల సరిశిక్షల్లేవే,
సమన్యాయం కడుదూరమే!
నేరచరితులు చరిత్రహీనులే,, సార్వభౌమత్వమే!
దేశభక్తుల బలిదానమే, ప్రజాస్వామ్య విధానమే!
ప్రజాస్వామ్య పరాభవం భరతమాత మానభంగమే!
ఆవేదనే నివేదన ఆలకించు, మా సింహాచలేశా!
71.
దేశమంతా చదువులే, నానాటికి పెరుగుతున్నాయే!
ప్రభుత్వ ప్రైవేటు సంస్థలు, భలే పోటీ పడుతున్నాయే!
ఉత్తమ ర్యాంకులే యువతీ, యువకుల వరిస్తున్నాయే!
అవినీతి, కుంభకోణ ,
ఆరోపణలెన్నో వస్తున్నాయే!
ఆవేదనే నివేదన ఆలకించు, మా సింహాచలేశా!
72..
జనం, నడక లంబకోణమే ,
అని ఎంచుకున్న వాళ్లే!
జీవితాన సరి సమయాన ,
పేలని తుపాకీ గుళ్ళే!
రసాల మామిళ్ళ పొలాల్లో,
పండుతున్నవే మేడిపళ్ళే!
శాంతిగృహ దూలమంతా, ఎన్నెన్నో కన్పించని పగుళ్ళే!
ఆవేదనే నీవేదన ఆలకించు,
మా సింహాచలేశా!
_________
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి