ఆవేదనే నివేదన.:- డా పివిఎల్ సుబ్బారావు,9441058797.
73.
వయసే స్త్రీపురుషాకర్షణే,
 ధర్మమేగా అలరారు! 

కుర్రకారు ప్రేమ సంగ్రామం,
 పెళ్లి కోసమే మహాపోరు!

దాంపత్య విజయాన,
 కావాలి జీవితం మల్లెలసౌరు!

చిత్రం, సంసార సారమే, పరస్పరాధిపత్యమే ఖరారు! 

ఆవేదనే నివేదన ఆలకించు,   
     మా సింహాచలేశా!
74.
పాలకుల్లారా మాకసలు, ఉచితాలేవీ ఇవ్వవద్దు! 

మీ ఆదాయం కోసమే ప్రజల్ని, మందుదాసులు చేయొద్దు! 

మీరిస్తున్న మందే మరి ,
సంసార సుఖశాంతులు రద్దు! 

యజమాని జీవితాన, చెరిపేస్తుంది ఆయువు హద్దు! 

ఆవేదనే నివేదన ఆలకించు,   
     మా సింహాచలేశా!
75.
ప్రజలకు వస్తువులేవీ ,
తేరగా పంచుతూ పోకండి!

చేపల్ని ఇవ్వద్దు జాలరి, పనిలో నైపుణ్యం నేర్పండి!

నిరుద్యోగ భృతి ఎందుకు, ఉద్యోగ ధృతి కల్పించండి!

భృతి మనిషి శిఖండే, 
ధృతే నడుపు బతుకుబండి!

ఆవేదనే నివేదన ఆలకించు,
    మా సింహాచలేశా!
_________


కామెంట్‌లు