82.ఉత్పత్తులే వెల్లువవ్వగా, ఎగుమతులే విస్తృతమే!విదేశీ ద్రవ్య ఆగమనమే, విత్తస్థాయి ఉన్నతమే!ప్రజల నిరంతర శ్రమే,ప్రగతి గతి త్వరితమే!ఆత్మ విమర్శ పాటిస్తే, విజయమే సదా స్వాధీనమే!ఆవేదనే నివేదన ఆలకించు,మా సింహాచలేశా!83.ప్రజల ఈసురోమనే తత్త్వమే, దేశాన అరిష్టమే!ప్రజల ఆరోగ్యమే అసలైన,దేశ మహాభాగ్యమే!దృఢయువత కుశలత,రక్షణరంగం అజేయమే!భారతత్రిదళ సామర్ధ్యమే, అనన్యమే దుర్భేద్యమే!ఆవేదనే నివేదన ఆలకించు,మా సింహాచలేశా!84.దేశ జనాభా మహిళా శాతం, సముచిత ప్రాధాన్యమే!నారీశక్తి అభ్యుదయ,ఆశయ సాధన సాఫల్యమే!రంగమేదైనా మహిళా, సాధికారత ప్రకటితమే!పోటీ ప్రపంచం మహిళలే, హవా చిర ప్రభంజనమే!ఆవేదనే నివేదన ఆలకించు,మా సింహాచలేశా!________
ఆవేదనే నివేదన.:- డా పివిఎల్ సుబ్బారావు,-9441058797.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి