34.
భాసురకపోలా, భక్తజనపాలా!
వేణుగానలోలా!
నా మదే బృందావనము,
అందు విహరించగా రావేలా!
నీవుండగా అది పావనమే, అన్య చింతల తావేలా!
నీ అనన్య చింతనే నామది, నిండిఉండ భయమేలా!
ఆవేదనే నివేదన ఆలకించు,
మా సింహాచలేశా!
35.
లక్ష్మీహృదయ విహారా!
కౌస్తుభాలంకారా! జాగేలరా!
నీ నామమే నిరంతరం,
ప్రీతిగా నోట పలికించరా!
నా వాసము నిశ్చింతల,
శాంతి నివాసమే కావాలిరా!
సత్సంగం, సజ్జనసాంగత్యం, దయతో అనుగ్రహించరా!
ఆవేదనే నివేదన ఆలకించు ,
మా సింహాచలేశా!
36.
కామిక మందార, అమిత, సుందరా, నామొర వినుము!
సర్వదా నాకొసగే అభయమే, మనో వాంఛితము!
నా మానస పుష్పమే,
సభక్తితో నీకే మంత్రపుష్పము!
ఏకైక అభీష్టమే నీ చరణాల, తల వాల్చడము!
ఆవేదనే నివేదన ఆలకించు,
మా సింహాచలేశా!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి