88.బతుకు నావే, లక్ష్యం దిక్సూచే,సరి విజయభావన!ఏలికపై ఏకాగ్రత ,చేయాలి నిరంతర సాధన!సమకూరు పనులు ధరలోన,అన్నాడుగా వేమన!కృషితోనే మనుషులే ,మహర్షులై ఉన్నారే జగాన!ఆవేదనే నివేదన ఆలకించు,మా సింహాచలేశా!89.మనిషి తన్ను తానుగా, తెలియడమే బ్రహ్మజ్ఞానము!బలహీనత క్రమేపీ,తగ్గడమే జ్ఞానప్రకాశము!బలాలు దిన దిన, ప్రవర్ధమానమే పరిణామము!జననం మరణం సహజం,నైపుణ్యం బుద్ధి వికాసము!ఆవేదనే నివేదన ఆలకించు,మా సింహాచలేశా!90.సామాజిక ప్రగతే కామన,ధనం వినా అసాధ్యమే!ధనం సమకూరాలే ,ఆచరణే పురుష ప్రయత్నమే!ప్రయత్నశీలివైతే తప్పక ,కలిసొచ్చేది కాలమే!జడత్వం చైతన్యమైతే,జీవితాన నిత్యం వసంతమే!ఆవేదనే నివేదన ఆలకించు,మా సింహాచలేశా!_________
ఆవేదనే నివేదన.:- డా పివిఎల్ సుబ్బారావు,-9441058797
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి