97.గగనాన పక్షులే,కలిసికట్టుగా ఎగురుతాయే!భువవాన జంతువులే ,మనకోసమే బతుకుతాయే!వన్యప్రాణులు వనాలకే, పరిమితమై ఉంటున్నాయే!మానవ జీవన రీతులే ,మరి క్రమం తప్పుతున్నాయే!ఆవేదనే నివేదన ఆలకించు,మా సింహాచలేశా!98.నాగరిక జీవనం బహు,దూరం మన గిరిజనులే!నిత్యం కొండ దిగి వస్తూ,మరల ఎక్కే శ్రమజీవులే!అవసరాలు తీరితే ,సంబరాలే నిత్య సంతృప్తులే!మోసం నేర్వని. వాళ్ళేగా,దోషం అంటని స్వచ్ఛ జీవులే!ఆవేదనే నివేదన ఆలకించు,మా సింహాచలేశా!99.జనాలు కుండ నీళ్లన్నీ,వంపి వర్షం ఎదురు చూస్తారే!కొమ్మల అంచున అందని, పువ్వులెన్నో కోయాలంటారే!అదేమిటో నేల విడిచి ,సాము చేయ ముందుకొస్తారే!మనిషి తెలివి తెల్లారే,ఉన్న కొమ్మే నరుక్కుంటారే!ఆవేదనే నివేదన ఆలకించు,మా సింహాచలేశా!_________
ఆవేదనే నివేదన.:- డా పివిఎల్ సుబ్బారావు,-9441058797.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి