ఆవేదనే నివేదన:- డా పివిఎల్ సుబ్బారావు,-9441058797..
100
మనిషి తెలివి పక్క దారే ,
పట్టి మరి విడవదే!

గట్టు మరిచిన ఎద్లయి,,
చేనులో ఆబగా . మేస్తోందే!

పనంటే పద్ధతే, పద్ధతే, అనుసరించు లక్ష్యమదే!

పద్ధతే విస్మరించి ,
ఫలితమాశిస్తే, కపటమదే!

ఆవేదనే నివేదన ఆలకించు, 
మా సింహాచలేశా!
101.
అమ్మ గర్భం శిశువు ,
పెరిగి తీరాలే నవ మాసాలే!

అందులోనే సరిరూపే, దిద్దుకుంటాయే అవయవాలే!

విరుద్ధంగా ముందుగానే, జన్మిస్తే మరి వికృతాంగాలే!

కలియుగం వింత తెలిపే,
శిశుపాల ప్రతిరూపాలే!

ఆవేదనే నివేదన ఆలకించు,
మా సింహాచలేశా!
102.
మనిషికి మక్కువ ఫలితం, 
ఎప్పుడూ గొప్ప ఆసక్తే!

మరి ప్రయత్నం మాటకొస్తే ,
చిత్తశుద్ధిలో నిరాసక్తే!

కార్యసిద్ధి కావాలంటే,
 నిషేధం ధనం కొనే ప్రసక్తే!

మనోవాంఛా ఫలసిద్ధి, 
ప్రజ్వలబుద్ధే, ఉజ్వలాసక్తే!

ఆవేదనే నివేదన ఆలకించు,
మా సింహాచలేశా!
________


కామెంట్‌లు