ఆవేదనే నివేదన:- డా పివిఎల్ సుబ్బారావు,-9441058797
103.
మనిషి అన్నీ కొనగలనే, అనడం అహంకారమే! 

అమ్మనివి ఎన్నో ఉన్నాయే, తెలియకుంటే అజ్ఞానమే! 

అన్నీ దోచి దాచేయాలే,
 నిత్యం తరగని ఆరాటమే!

ప్రాణం మాత్రం దాచలేడే, లిప్తలో పోగొట్టుకోవడమే! 

ఆవేదనే నివేదన ఆలకించు,
మా సింహాచలేశా!
104.
రైతు బతుకు వసివాడక,
నిత్యమూ చల్లగుండాలే!

వాడి ముంగిట చల్లకుండ, శ్రామిక దాహమే తీర్చాలే!

వాడిపొలాల పండేపంటలు, గాదెల నిండి ఉండాలే!

 అన్నదాత మన బతుకుల్ని.
 బతికిస్తూ బతకాలే!

ఆవేదనే నివేదన ఆలకించు,
మా సింహాచలేశా!
105.
రైతు బతుకు ఎప్పుడైనా, ప్రకృతితో ఆడే జూదమే! 

ఒంటరిగా పోరాటమే ,
తోడు వస్తారంటే విభేదమే! 

దేశం వెన్నెముక విరిగితే, అతకడం వివాదమే! 

వాడి మరణం నెలకొను,
 దేశాన తీవ్ర ప్రమాదమే!

ఆవేదనే నివేదన ఆలకించు,
మా సింహాచలేశా!
_________
..

కామెంట్‌లు