109.గోడలు, మేడలు ,తోటలు, కోటలు ,బడులు, గుడులే!గృహాలు, మసీదులు, చర్చిలు, గురుద్వారాలు ,సత్రాలే!దేశాన దారులు, వారధులు, సమాధులు, ఆశ్రమాలే!ఆరాళ్ళెత్తే కూలోళ్లే ,కలియుగ శ్రమ దానకర్ణులే!ఆవేదనే నివేదన ఆలకించు,మా సింహాచలేశా!110.ఏరోజుకారోజు,పనేవెతుక్కుంటూ,తిరుగుతుంటారే!బళ్ళపై వీధులు తిరిగి,పళ్ళు కూరలు అమ్ముతారే!న్యూస్ పేపర్సు వేస్తారే,గ్యాస్ బండ ఇంటికే తెస్తారే!మన కోసమే బతుకన్న,కష్టజీవులెందరున్నారే?ఆవేదనే నివేదన ఆలకించు,మా సింహాచలేశా!111.కలిసొచ్చిన ఓవర్గానికే ,కాలం సరి రత్నగర్భే!వ్యూహాలు ఫలిస్తే కాలమే,విజయోత్సవాల విదర్భే!కాలం కాటేసిన వాళ్ళకి,అదొక మంత్రించిన దర్భే!వెక్కిరించి ఆగ్రహిస్తే,నిత్యం జ్వలించే అగ్నిగర్భే!ఆవేదనే నివేదన ఆలకించు,మా సింహాచలేశా!________
ఆవేదనే నివేదన.:- డా పివిఎల్ సుబ్బారావు,-9441058797.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి