ఆవేదనే నివేదన:- డా పివిఎల్ సుబ్బారావు,-9441058797.
112.
ఆనాడు నేను యోధుడ్నే,
 నేడా? ఆయుధమేదీ లేనోడ్నే!

విద్యాధికుడ్నే నేడావిద్య,
మిథ్యే ఎరుక వచ్చినోడ్నే!

ఉన్నతోన్నతుడ్నే మరుగున, నేడు మాజీగాఉన్నోడ్నే!

పెద్ద కుటుంబ యజమానై,
నేడెవ్వరకీ. పట్టనోడ్నే!

ఆవేదనే నివేదన ఆలకించు, 
మా సింహాచలేశా!
113.
ఆనాడు అమ్మానాన్న తోడుగా, భార్యా బిడ్డలూ ఉన్నారే!

హితులు ,స్నేహితులు అభిమానులు ,వెంటపడే వారే!

నా బలగం సాగరమే,
 నేడెవ్వరూ అలలై లేవరే! 

 అసలీ నకిలీ తెలియవే,
మజిలీలే అంటున్నారే!

ఆవేదనే నివేదన ఆలకించు,
మా సింహాచలేశా!
114.
ఈనాడు నేను ఏ ఇంట, ఆతిథ్యం అందని అతిథినే!

ఆదరణ నోచుకోని అనాధ,   అభాగ్యాత్మీయుడినే!

మార్కెట్లో మారని ఎవరూ, కోరని పాత రూపాయినే!

అందరూ  వీడ్కోలు చెప్పే,
గమ్యమేలేని బాటసారినే!

ఆవేదనే నివేదన ఆలకించు, 
మా సింహాచలేశా!
_________


కామెంట్‌లు