ఆవేదనే నివేదన:- డా పివిఎల్ సుబ్బారావు,-9441058797.
37.
అఖిలలోకారాధకా! సురశరణా! దయాసింధువు!

లోకాలన్నింటికీ నీవేగా, ఫూజ్యుడవు, లోకేశుడవు!

సురులే శరణు కోరగా ,
దేవా, అభయమిచ్చినావు! 

అసురుల భారి నుండి,
 ఎంతో భద్రత కల్పించినావు! 

ఆవేదనే నివేదన ఆలకించు,  
    మా సింహాచలేశా! 
38.
సురుచిరలావణ్యా,
 సౌందర్యరత్నాకరా నీ తలపే!

పున్నమి వెన్నెల పిలుపే ,
         నీవేగా మా ఇలవేలుపే!

నాది ఆమని కోయిల,
 పిలుపే ఎరుగదు అలుపే!

నిన్ను చేరడమే మానవ ,
     జీవన అసలు గెలుపే!

ఆవేదనే నివేదన ఆలకించు,
      మా సింహాచలేశా!
39.
ఘనచక్రహస్తా! జగత్ప్రశస్తా జడత్వ సంహారకా!

జన్మ మృత్యు జీవన చక్ర ,
సదా సమూల నిచ్ఛేదకా!

నాదు ఓర్పు ఎరుగంగ, నీకున్నదే కమ్మని కోరికా!

నాకు పరీక్షే నీకు ఆనందించ,
 భలే వింత వేడుకా

ఆవేదనే  నివేదన ఆలకించు,
     మా సింహాచలేశా!
_________


కామెంట్‌లు