106.ముడి వస్తువుకే సుందర, రూపమే ఆవిష్కరిస్తాడే!నిత్యము కష్టిస్తూ నడిచే, సూర్యుడై వెలుగులిస్తాడే!నిజాయితీ పనివాడే,శ్రమలో కల్తీ చేయనివాడే!వాడు శ్రామికుడే సమాజాన, ఉత్పత్తుల కారకుడే!ఆవేదనే నివేదన ఆలకించు,మా సింహాచలేశా!107.ఇంటి వృత్తులు సమాజాన, బహుఉపాధుల మార్గాలే!సరిచేతి మగ్గాలే చేనేత, వస్త్రాలు కళ్లకందాలే!కుమ్మరి మట్టి రూపాలతో,తీర్చు గృహ అవసరాలే!కమ్మరి కర్ర నగిషీలు, వన్నెతెచ్చు అలంకారాలే!ఆవేదనే నివేదన ఆలకించు,మా సింహాచలేశా!108.శిల్పి ఊపిరే ఉలిగా,శిలల్ని చెక్కి బతుకుతాడే!శిల్పం దివ్య సౌందర్యం,నింపి సజీవమే అనిపిస్తాడే!రాయినే దైవంగా చేసి, నిత్యము పూజలు చేయిస్తాడే!మనిషిగా మరణించి,జీవకళై కళ్ళ ముందుంటాడే!ఆవేదనే నివేదన ఆలకించు,మా సింహాచలేశా!_________
ఆవేదనే నివేదన.;- డా పివిఎల్ సుబ్బారావు.-9441058797.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి