ఆవేదనే నివేదన.:- డా పివిఎల్ సుబ్బారావు,-9441058797.
40.
పన్ళగశయనా! గరుడగమనా!
 పరుగున రావా!

భక్త హృదయ నిరీక్షణే, 
      మరి సఫలము చేయవా! 

దర్శనభాగ్యమే కలిగించి,
 నాకు ధన్యత కల్పించవా!

నీ భక్తతత్పరత మరోసారి,  
    ఋజువు చేసుకోవా!

ఆవేదనే నివేదన ఆలకించు,
    మా సింహాచలేశా!

41.
   జగన్నాటక సూత్రధారి!
     పీతాంబర ధారి! రావేమి!

   బతుకే నాటకం ముగించు,
 నా పాత్ర ఇక చాలు స్వామి! 

  మరింకా నటించి మెప్పించే,
    నాలో లేదు ,సరి బలిమి!

నీ కరుణ ఒక్కటే కదా ,
     నేనాశించే మేటి కలిమి!

ఆవేదనే నివేదన ఆలకించు,
       మా సింహాచలేశా!

42.
       పంకజనయనా!
          పావనహృదయా! 
              బెట్టు చేయకయా! 

నీవైతే ఆదిశేషువుపై ,
హాయిగా శయనిస్తావయా!

ఈ నాశయ్య అంపశయ్యే,
మరి కాదా ఇదే హరిమాయా!

అంపశయ్య భీష్ముడ్నే కాచావు,
          భీష్మించక కావవయా!

ఆవేదనే నివేదన ఆలకించు,
    మా సింహాచలేశా!
_________


కామెంట్‌లు