ఆవేదనే నివేదన:- డా పివిఎల్ సుబ్బారావు,-9441058797..
43.
మకరకుండల భూషణా! మృదుభాషణా! మాట విను!

మకరి బారి కరిగాచిన ,
        నీ ఘనత ఏమనను! 

గీత పార్ధుడికే ఊత,,
 నాచేయూత ఎవరనుకోను?

నా గీత సరిదిద్దు మోక్షమే, ముద్దు మరేమి కోరను!

ఆవేదనే నివేదన ఆలకించు, 
    మా సింహాచలేశా!

44.
క్షీరసాగరవిహారా!    
 నిరూపమాకారా! భద్రాత్మకా!

అనంత దుఃఖసాగర,
 సంపూర్ణ శోషణ సమర్ధకా!

భవసాగరమే దాట,
నావ నడిపే మేటి నావికా!

శరణన్న వారిని ,
సతతం, కాచిన పరిపాలకా!

ఆవేదనే నివేదన ఆలకించు, 
    మా సింహాచలేశా!

45.
యదుకులాంభోదిచంద్రా! 
భూరిగుణసాంద్రా! బ్రోవరారా!

నా యెద నిలిచిన ఈశ్వరా,
         ఆశ్రిత భక్త మందారా!

భక్త భవహర తత్పరా,
     ఆదుకొనే ఓ పరాత్పరా!

గోవిందా,ముకుందా,మాధవా,
      కలియుగ వేంకటేశ్వరా!

ఆవేదనే నివేదన ఆలకించు,   
       మా సింహాచలేశా!
________


కామెంట్‌లు