46.జంతూనాం నరజన్మ దుర్లభం, అన్న ఆదిశంకరులు!నరులందరిలో నారాయణుడే,, అన్న గీతాచార్యులు!నేనెరిగిన నారాయణ, స్వరూపులకు నమస్సులు!పెడదారి పట్టే మాయాగ్రస్తులే, కావాలి విముక్తులు!ఆవేదనే నివేదన ఆలకించు,మా సింహాచలేశా!47అమ్మ దుర్గమ్మగా జీవితాంతం, నాకోసమే బతికింది!నా బతుకు ప్రపంచాన ఎంతో, ఎత్తులో నిలబెట్టింది!పారిశుద్ధ్యం నుండి శుద్ధితో,ఓ స్వచ్ఛత ప్రసాదించింది!నాకు పరమార్ధమిచ్చే,,పరమాన్నమే పెట్టి పెంచింది!ఆవేదనే నివేదన ఆలకించు,మా సింహాచలేశా!48.నాన్న! మేలుదారి వేసి, వేయికళ్ల వెన్నంటి ఉన్నాడే!ఒళ్ళు దాచుకోక బతికిన అమాయక కర్షకుడే!జీవితాంతం వేదం నమ్మి,,స్వేదం స్రవించే యోగిశ్వరుడే!ఇహపరాల నైపుణ్యమిచ్ఛే,జన్మదాత జనకుడే!ఆవేదనే నివేదన ఆలకించు,మా సింహాచలేశా!_________
ఆవేదనే నివేదన:- డా పివిఎల్ సుబ్బారావు,-9441058797.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి