ఆవేదనే నివేదన.:- డా పివిఎల్ సుబ్బారావు.-9441058797.
49.
నా గురువులు కల్పతరువులే, 
            బ్రహ్మజ్ఞాననాధులే!

నా సత్యాన్వేషణ ప్రాప్తికి,
    దృఢ విజ్ఞాన వారధులే!

నా విద్యా జైత్రయాత్ర లో,
   సాఫల్యతాసిద్థి సుబోధులే!

మందమతి సుమతి చేయ,   
     దిగొచ్చిన దయానిధులే!

ఆవేదనే నివేదన ఆలకించు, 
      మా సింహాచలేశా!

50.
జీవితం అమ్మ, అయ్య ,
ఆచార్య సమష్టి కృషిఫలమే!

దివ్య ఆశీస్సులతోనే,
 సంపూర్ణ వ్యక్తిత్వ వికాసమే!

బోధనకి సాధన తోడైతేనే,
          జీవితం సఫలమే!

ప్రతి ప్రభాతం సుప్రభాతమే,
      నిర్విరామ గమనమే! 

ఆవేదనే నివేదన ఆలకించు,
     మా సింహాచలేశా!
51.
నేను నమ్మిన ఆదర్శాలన్నీ,
      తేలిపోతున్న మబ్బులే! 

ఎదురయ్యే పరిస్థితులే,
        పదునైన చురకత్తులే!

బతుకంతా బహుప్రవృత్తులే,
              కఠిన కసరత్తులే!

సంస్కారాలు ,పూలగుత్తులై,
   రాలె, వ్యాపించె విపత్తులే!

ఆవేదనే నివేదన ఆలకించు, మా సింహాచలేశా!
________


కామెంట్‌లు