ఆవేదనే నివేదన.:- డా పివిఎల్ సుబ్బారావు -9441058797.
79.
దేశజనాభా భారమా?
 వరమే అని నిరూపిద్దామే!

మేటి కర్షకుల్ని అన్నదాతల్ని, జాతికి అందిద్దామే! 

అతివృష్టి- అనావృష్టి ,
రైతన్నకు అండై నిలుద్దామే! 

దేశఆత్మేరైతు,
      రైతుఆత్మహత్యా?
                అడ్డుకట్టేద్దామే!

ఆవేదనే నివేదన ఆలకించు, 
    మా సింహాచలేశా!
80.
ప్రజలందరినీ అక్షరాస్యులవ్వ, తీర్చిదిద్దుదామే! 

గానుగెద్దులుగా ,
బతికే వాళ్ళకి శిక్షణ ఇద్దామే! 

నెల్లూరు పందెం ఎద్దులుగా, దేశాల నిలబెడదామే! 

శ్రమ, సాంకేతికత ఏకం, నవభారతం నిర్మిద్దామే!

ఆవేదనే నివేదన ఆలకించు, 
మా సింహాచలేశా!
81.
చదువే ఉద్యమం ,జ్ఞానమే, ఆశయం , ముందడుగేద్దామే!

జ్ఞానసముపార్జనే ధ్యేయమై, జనాన్ని చదివిద్దామే! 

అంధవిశ్వాసాలంతమవ్వ, 
విజ్ఞానదృష్టే సారిద్దామే!

ప్రగతి నిర్మాణ సాధనం,
జ్ఞానగాండీవం ధరిద్దామే!

ఆవేదనే నివేదన ఆలకించు, 
 మా సింహాచలేశా!
_________


కామెంట్‌లు