ఆవేదనే నివేదన.:- డా పివిఎల్ సుబ్బారావు,-9442058797.
61.
కళ్ళెదుట కాంచ ,అగమ్య, అభాగ్య అనాధ పిల్లలే! 

బాల్యమే బజారున,
 పడగా తెగిన గాలిపటాలే! 

బాల్యం బాగున్న బాలలే, దేశానికి రేపటి పౌరులే! 

దేశ వికాస సౌధ,
 పునాదులే బాలల జీవితాలే! 

ఆవేదనే నివేదన ఆలకించు, 
మా సింహాచలేశా!
62.
అనాధ శరణాలయ,
 సరి నిర్వహణే సాధనము! 

ప్రభుత్వ స్త్రీశిశుసంక్షేమశాఖ,
కఠిన శాసనము!

అనాధల ఆదరణ పోషణ ,
సరి సమాధానము! 

బాలల సక్రమ వికాసమే ,
దేశ నిజ వికాసము!

ఆవేదనే నివేదన ఆలకించు,
మా సింహాచలేశా!
63.
పిల్లలు లేనివారు అనాధల, అమ్మానాన్న కావాలి! 

ఉభయ తారకమై,
 ఒకరికొకరు తోడై ఉండాలి! 

ఇదే ఆత్యుత్తమ సేవే ,
పిల్లలు లేనివారు చేయాలి!

అనాధలు సనాధులై,
 ప్రగతి సారధ్యం వహించాలి! 

ఆవేదనే నివేదన ఆలకించు, 
మా సింహాచలేశా!
_________


కామెంట్‌లు