64.మొక్కయి వంగనివారు,మానై వంగరే నిత్య సత్యమే!పిల్లల ప్రవర్తనాదిలోనే,క్రమబద్ధం అవశ్యమే!పెద్ద నేరస్తుల నేపథ్యం,అక్రమ బాల్య జీవనమే!చేతులు కాలాక ఆకులతో,ప్రయోజనమే శూన్యమే!ఆవేదనే నీవేదన ఆలకించు,మా సింహాచలేశా!65.పిల్లలు పక్కదారా?పక్కాదారిలోనే నడిపించాలి!సమస్య మనదే సరి, సమాధానం మనమే ఇవ్వాలి!కర్త కర్మ క్రియ మనమే ,తు.చ. తప్పక పాటించాలి!పిల్లలంటే భావి మానవ,వనరులే పెంచుకోవాలి!ఆవేదనే నివేదన ఆలకించు,మా సింహాచలేశా!66.తక్షణ ప్రజా ఉద్యమం, సంపూర్ణ దారిద్ర దహనమే!స్వేదం చిందిస్తే జనజీవనం,సదా పురోగమనమే!సోమరితనం సంఘాన ,పెద్ద చీడే తొలగించడమే!కష్టజీవుల ఓర్పు నేర్పు ,మార్పు తూర్పున ప్రత్యక్షమే!ఆవేదనే నివేదన ఆలకించు,మా సింహాచలేశా!_________
ఆవేదనే నివేదన.:- డా పివిఎల్ సుబ్బారావు,-9442058797
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి