ఇచ్చి పుచ్చుకునే పిల్లలం
నచ్చి మెచ్చుకునే మల్లెలం
కీర్తి దాహం లేని వారాలం
స్ఫూర్తి మోహం ఉన్న పోరలం !
అందరితో కలిసి ఉంటాం
అందరినీ అరుసు కుంటాం
మాటా మంతి కలుపుకుంటాం
ఆటపాటలతోని ఆడుకుంటాం !
ఒకరి మనసు ఒకరం తెలుసుకుంటాం
మా మనసులోని మాటను తెలుపుకుంటాం
కలిసిమెలిసి ఇక అందరం కూడి ఉంటాం
మా ఐకమత్యమే బలమని నిరూపించుకుంటాం !
కోరుకున్న చదువులే చదువుతాం
ఏరుకున్న పదవులలో ఎదుగుతాం
ఎదిగినా ఒదిగే ఉంటాము మేము
విర్రవీగేటోల్లము మేంఅసలు కాము
మా దేశం కోసం ప్రాణమైన ఇస్తాం
అభివృద్ధికై బంగరు బాటలే వేస్తాం
అంతా మాతో కలిసేలా ఇక చేస్తాం
ఉన్నత శిఖరాలనూ అధిగమిస్తాం
సమతా మమతలను మేం ప్రేమిస్తాం
ఆ దిశ వైపే అందరిని ఇక కదిలిస్తాం
నభూతో న భవిష్యత్తు అని నిరూపిస్తాం !
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి