అమ్మ లేనిది మనం ఇంక
లేం ఆమె ఉంటేనే మనం
అందరికీ తెలుసులే నిజం
అయినా కొందరిలో నిస్తేజం!
అమ్మ అనే మాట
కమ్మదనాల మూట
చెబుతారులే నోట
తప్పుతారు బాట !
అమ్మ మన అమృత బాండం
అమ్మ సం సంస్కృతి అఖండం
అమ్మ అండ పిండ బ్రహ్మాండం
అమ్మ లేకుంటే బ్రతుకు సుడిగుండం !
మన అమ్మ లేని ఈబ్రతుకు
ఎన్నటికైనా తప్పక చితుకు
అని తెలుసుకొని జీవించు
ఆమె దేవతని భావించు!
అమ్మ మనకు ఇచ్చు బ్రతుకు
తినిపించు కమ్మని మెతుకు
మనమే ఆమె సర్వస్వం అని
భావిస్తూ తను జీవిస్తుంది!
మన కళ్ళకు కనిపించే దైవం
మన కన్నీళ్లను తుడిచే వైనం
ఇక నిత్యం మరువరాదు మనం
నీవే ఘనం అని గుర్తించు జనం!
అటువంటి బ్రతుకు నిచ్చు అమ్మ
కొలిచే మన మది గుడిలోని బొమ్మ
అనంత జగత్తు కొలిచే ఈ జేజమ్మ
మనకు అమ్మయై ఇల జన్మించినమ్మ!
అందుకే ఆమె అయ్యింది ఆరాధ్య దైవం
ఈ సత్యం గమనించి అంతా నడుచుకోవాలి వైనం
అప్పుడు అవుతుంది మన జన్మ పావనం
ఎప్పుడు కోరుకో ఇక అదే జీవనం !
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి