ఓ నవ్వుల పువ్వుల చిలకమ్మా
మా మువ్వల గవ్వల మొలకమ్మా
అసలే అలకలు నీకు ఇక వద్దమ్మా
సిసలైన మొలకలే నీకు ముద్దమ్మా!
మేం చెప్పే మాటను వినవమ్మా
నీ తప్పుడు త్రోవను విడువమ్మా
నీ మంచిని కోరే చెబుతున్నాము
ఓ కంచం నీకిక పెడుతున్నాము !
ప్రతి నిత్యం నీవిక వేంచేయాలి
నీ బత్యం వెంటనే భోంచేయాలి
అప్పుడు కలుగును నీకు సౌఖ్యం
నీ ఆరోగ్యమే మాకు ఇక ముఖ్యం !
మా మాటను తప్పే దానవు కావు
నీ ఆటకు చూపిస్తాం మేమిక తావు
అక్కడనే సాగించు నీ ఆటపాటలు
ఇక్కడనే ముగించు నీ కోతి చేష్టలు
నీవు మా మాటల ఇక మన్నించు
నీ మదిలో ప్రేమను మాకు కల్గించు
నీ చెలిమి దివ్యదీపాలను వెల్గించు
అవి కలిమి శుభాలను మాకందించు !
అప్పుడు నీవు మేము అంతా పదిలం
ఒకరి స్నేహం ఒకరం ఎప్పుడూ వదలం
ఎవరి చేతిలోనా కాములే మనం పావులం
అప్పుడౌతాం మనం ఇరుగుపొరుగు జీవులం !
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి