సిరిపురం సిన్నోడు !:-గుర్రాల లక్ష్మారెడ్డి కల్వకుర్తి.-సెల్.9491387977-నాగర్ కర్నూల్ జిల్లా.
సిరిపురం చిన్నోడా
సిరి వరం ఉన్నోడా
పట్నం దారి పట్టావు
కట్నం మరి ఎగ్గొట్టావు !

మాట తప్పినావు
మడమ తిప్పినావు
నమ్మేది నిన్ను ఎట్లు?
మేం వేసేది నీకు ఓట్లు !

స్వీట్లు పంచుతావు
స్నేహం పెంచుతావు
పడతావు నీవు పాట్లు
అడుగుతావులే ఓట్లు  !

చిందిస్తవు నవ్వులు
అందిస్తవు పువ్వులు
పాగుడేవులే అందరిని
 చేరేవులే  వారి దరిని  !

నీవు అందరిని  కలుస్తావు
తోడు రావాలని పిలుస్తావు
పోటీ  రంగంలో నిలుస్తావు
గెలవాలని నీవు ఆశిస్తావు !


గల్లి గల్లి తిరుగుతావు 
గడప గడప ఎక్కుతావు నీవందరికి మొక్కుతావు
ఏ కొందరికో చిక్కుతావు !

అందరికీ చేస్తావులే  సలాం
అందరికీ అవుతావు గులాం
 ఓట్ల కోసమేగా ఈ నాటకం
సీట్ల కైవసముకై ఈ భూటకం !

నీవు మందు పోస్తవు
తావున విందు ఇస్తవు
అంతులేని హామీలను
అందరికి అందిస్తవు. !

ఎలక్షన్ల గెలిచి నీవు
కలెక్షన్ల కింగ్ ఔతావు
మేం హామీల మాటంటే
మీతో మాకు ఇక తంటే !

మేం ఆశలకు లొంగి
మా దురాశలో పొంగి
వేశాము మీకు ఓటు
వేశావు మాకు పోటు  !


కామెంట్‌లు