మేలుకొలుపు మల్లెలం:- గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.-సెల్ నెంబర్.9491387977.-నాగర్ కర్నూల్ జిల్లా.
పిల్లలం పిల్లలం పిల్లలం పిల్లలం
పలువలు తులువలు కాని పిల్లలం
మల్లెలం మల్లెలం మల్లెలం మల్లెలం
విలువలు గల కొలువుల మల్లెలం !

మురిపించే రత్నాల్లా వెలుగుతుంటం
మెరిపించే ముత్యాల్లా మెలుగుతుంటం
సకుటుంబ సపరివారంగా ఉండాలంటం
అండదండలతోహాయిగా ఉంటే మేలంటం !

మేం ఇరుగుపొరుగును ప్రేమిస్తాం
కలిసి ఉండాలనివారిని ప్రేరేపిస్తాం
వారికి మా స్నేహ హస్తం అందిస్తాం
కోరి కలిమి చెలిమిలోఇక బంధిస్తాం

జ్యోతిలోని వత్తిలా కరిగి వెలుగుతాం
జాతికి ఆ వెలుగులను పంచుతాం
ఖ్యాతిని ప్రఖ్యాతిని ఇల పెంచుతాం
సఖ్యతతో ఆ కీర్తిని ఉన్నత శిఖరం పై ఉంచుతాం !

దేశమంటే మకంతు లేని ప్రేమ
మా దేశం కై పడతాం మేం శ్రమ
పోరు సేయు సైనికులుగ మారుతం
మా భారతీయ సైన్యంలో చేరుతం!

భారతీయ సంస్కృతిని గౌరవిస్తాం
సాంప్రదాయ సంగతుల వివరిస్తాం
మా దేశ ప్రజలందరినీ  ప్రేమిస్తాం
దేశభక్తిని పెంచేలా మేం ప్రేరేపిస్తాం!

మా స్వాతంత్ర నాయకుల స్మరిస్తాం
పరతంత్ర వినాయకుల విస్మరిస్తాం
మాజాతీయ పండుగల జరిపిస్తాం
మేం నిజాయితీగా ఉండి మురిపిస్తాం!

మా దేశం కోసం ప్రాణాలైనా ఇస్తాం
సందేశంతో సత్వరమే స్పందిస్తాం
ఐక్యమత్యమే బలమని ప్రభోదిస్తాం
సఖ్యత కలిగుండాలని సంభోదిస్తాం !


కామెంట్‌లు