మన ఋషులు-వారి సూక్తులు:- గుర్రాల లక్ష్మారెడ్డి కల్వకుర్తి.-సెల్.9491387977.-నాగర్ కర్నూల్ జిల్లా.
 1). వ్యాసుడు-----నిన్ను నీ వెరుంగుము.
2). భృగుడు------నీ మనోవృత్తిని జయించుము.
3). కఠ ఋషి-----సర్వదా నీ వాగ్దోషములను కనిపెట్టుచుండుము.
4). మండుక ఋషి-----సుఖదుఃఖములు మనసునకే గాని తనకు కాదని గ్రహింపుము.
5). వశిష్ట మహర్షి-----ఈ సృష్టి అంతయు మాయా విలాసమే అని తలంపుము.
6). మనవు-----సమాధిలో ఉన్నప్పుడు గోచరించు వివిధములైన వెలుగులకు గ్రమింపకుము.
7). ఉద్దాలక మహర్షి ----నిత్య తృప్తియే పరమ ఐశ్వర్యమని తలంచుము.
8). యాస్క మహర్షి -----అహంకారమే అన్ని అనర్థాలకు మూల కారణం.
9). శాకాటాయన ఋషి-----కామ క్రోధములే నరక ద్వారములని నిశ్చయింపుము.
10). జమదగ్ని మహర్షి-----మనశ్శాంతిని, మనస్సు శుద్ధిని పొందుటమే మానసిక తపస్సు అని భావింపుము.

కామెంట్‌లు