పోరు చేయు పోరలం:- గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.-సెల్ నెంబర్.9491387977.-నాగర్ కర్నూల్ జిల్లా.
టంగుటూరి పిల్లలం
టింగు రంగ మల్లెలం
ఈడు జోడు వారలం
తోడు నీడ  పోరలం !

          పచ్చని చెట్లను పెంచుతం
          పండ్లు ఫలాలను పంచుతం
          మంచికి తల మేంవంచుతం
          అందరి మేలును ఎంచుతం!

మేం ఊరి పేరును నిలుపుతాం
మా చిరునామాను తెలుపుతాం
దుష్టుల దుమ్మును దులుపుతాం
మా కష్టకాలమును గడుపుతాం !

చెప్పుడు మాటలు వినము
తప్పుడు బాటలు   కనము
మంచితనమే మా ధనము
ఎంచిన పెంచిన ఇందనము !

దుష్టులకు ఉంటాం మేం దూరం
స్పష్టం చేయుట కాదులే భారం
కోరుతాం మేం దుష్టుల సంహారం
చేరుతాం మా కష్టసుఖాల  తీరం !

మేం వరదై కురిసే ధారలం
మిల మిల మెరిసే సీతారలం
గుండె దడ కలిగించే పిడుగులం
అండదండలందించే గొడుగులం !


కామెంట్‌లు