వనస్థలిపురం అనే రాజ్యంలో కన్నయ్య అనే పిల్లవాడు ఉండేవాడు. కన్నయ్య చాలా తెలివితేటలు గలవాడు. వనస్థలిపురం రాజ్యాన్ని పరిపాలిస్తున్న విశ్వతేజుడు ప్రజలందరికీ పరీక్ష పెట్టాలని పిలిపించాడు. ఒక గ్రామంలో చెవిటివాడు, గుడ్డివాడు, పిచ్చివాడు ముగ్గురు మర్రి చెట్టు కింద కూర్చుండగా, ఆ మర్రిచెట్టు పైనుంచి ఒకవేళ మామిడిపండు పడితే ఆ ముగ్గురులో పండును ఎవరు తీసుకుంటారు అని రాజు విశ్వతేజుడు అడిగాడు.
ప్రజలందరూ తలా ఒక సమాధానం ముగ్గురు పేర్లు చెప్పసాగారు. మీరు చెప్పిన సమాధానం తప్పు సరైన సమాధానం చెప్పండి అని రాజు అన్నాడు. అంతలో కన్నయ్య అనే పిల్లవాడు నేను సమాధానం చెప్తాను మహారాజు అంటూ ముందుకు వచ్చాడు. కన్నయ్యను చూసిన ప్రజలందరూ కూడా చిన్నపిల్లడివి నువ్వేం సమాధానం చెప్తావ్ అంటూ హేళన చేస్తూ నవ్వారు.
కత్తి చేసే పని సూది చేయలేదు మరి నీవేలా సమాధానం చెప్తావని మహారాజు అన్నాడు. అప్పుడు కన్నయ్య మహారాజా! కొన్ని కొన్ని సార్లు సూది చేసే పని కూడా కత్తి చేయలేదు కదా అని అన్నాడు. కన్నయ్య మాటలకు మహారాజు విశ్వతేజుడితో పాటు ప్రజలందరూ ఆశ్చర్యపోయారు. జవాబు చెప్పడానికి కన్నయ్యకు మహారాజు అవకాశం ఇచ్చాడు.
మహారాజా! ముందుగా నాకు ఒక అనుమానం మర్రి చెట్టు నుంచి మామిడిపండు ఎలా పడుతుంది. అయినా ఏదో జంతువు చెట్టుపై నుంచి తినబోయి మామిడిపండు కిందపడిన ఆ ముగ్గురికి కాక బాటసారి దొరికి ఆ పండును నాలుగు భాగాలుగా చేసి, చెవిటి వాడికి, గుడ్డివాడికి, పిచ్చివాడికి తలో భాగం ఇచ్చి, మిగతా భాగం బాటసారి తింటాడని సమాధానం ఇచ్చాడు. మహారాజు విశ్వతేజుడు కన్నయ్య సమాధానాన్ని మెచ్చుకుని దగ్గరికి తీసుకుని కౌగిలించుకుంటాడు. ప్రజలందరూ కూడా కన్నయ్య మేథస్సుకు సంతోషిస్తారు. తీరిక వేళలో రాజమందరానికి కన్నయ్యని పిలిపించుకుని మహారాజు ప్రశ్నల ద్వారా ముచ్చటించుకోసాగారు.
నీతి: ఎప్పుడు కూడా ఎవరిని తక్కువ చేసి చూడకూడదు. చిన్నవారికైనా సమాధానం చెప్పే శక్తి ఉంటుంది.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి