మనసు తొక్కులాట ఇల్లు సయ్యాట పల్లెసిరిపాట
దోరదోర చూపులు దొరికే తలుపులు తెరిచే ఊరు
పులుపు తీపి వనగాయ కాచే ఊరు ఉగాది చెట్టు
ఆశల ఊపిరిలో ఆడే బాల్యం చదివే ఊరే కావ్యం
ఒడి అమ్మదే ఒడిసిపట్టే కొమ్మ ముఖం మిలమిల
యావ పెద్దదే యువ గొప్పదే రేపటి ఆట కవిరాతే
దోసిలి నాది ఓనమాలు నేర్పేనది ఊరు దిద్దేబడే
అవార్డే పనీపాట బాధజోలే ఊరట ఊరేలే రివార్డ్
మధురసీమ ఊరు రేపటి బాలల మైదానక్రీడభై జై
మనసు పరుగు మనిషి ప్రశాంతనవ్వు పల్లెశాంతి
ఇరుగు నురుగు నది పొరుగు ఊరు కదిలేస్వప్నం
చుట్టుపక్కల చెట్టపట్టాల్ పల్లెమది ఆనందసీమలే
సుందరతీరాల నందనకెరటాలు ఊరు భాగ్యసీమ
ముందువారు సేదదీరే నాఊరు సృజన ఆలాపనే
ఆదరువు ఆదరణ కరువేలేని మట్టివాసన ఊరేలే
అరచేతి గోరింట మునిపంట కోపం చూసేపల్లె ఇల్లే
గోగుపూలు ఊగే గాలి పొలంపాట పల్లె దరువుదే
తూలడంలేని మాట నడక సాఫ్ సుత్రా పల్లెసీమ
అతడూ ఆమె నీవూనేను సమాజం కదిలే ఊరు
పూలమనసు కరగనికల ఊరుతరువు పల్లెగీతం
పట్టుక నడక నాదే ఊరుఊపిరి నింగినేలే దారి
=================================
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి