గుండె గదుల్లో చల్లటి వెన్నెలలేకాదు
బడబాగ్ని జ్వాలలు ఉవ్వెత్తున ఎగుస్తాయి....
మంచితనాకి మసిపూస్తే
మదిలోని మరుమల్లెలు వసివాడిపోతాయి...!
నిన్ను నమ్మి నీదాననైన దాన్ని
అనుమానపు చూపులు నా పైన విసిరి,
నామాటను వక్రీకరిస్తావు
నా చేతలను తప్పని అంటావు
సూదుల్లాటి నీ మాటలకు
నేను కన్నీరు మున్నీరుగా విలపించంగ
విధాత రాతనెవడు మార్చలేడంటావు
పెళ్లి పేరుతో ఒక్కటైనజంట తనువు
అణువణువూ కట్టుకున్నోడి సొంతమై
సహధర్మచారిణై ,రాజిల్లుదశలోన
అనుమానపు విష(చెద)పురుగు
పాలకడలిలాంటి కాపురాన గరళాన్ని నింపొద్దు
మార్చుకో నీ వైఖరి,
చేరదీసుకో నీ సహచరి,
చక్కనైన కాపురానికి నమ్మకమే ఊపిరి.
ఎవరికైనా ఉంటుందిగదా స్వీయ ఆత్మగౌరవమ్మని
ఎల్లజనులు ప్రవర్తిస్తే భూలోకమే స్వర్గతుల్యం
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి