అందమైన స్మార్ట్ ఫోన్ అన్నీతానై
అల్లుకుంది.
పుస్తకమ్ము e -book గా చూపి
పీడీఎఫ్ ఫైళ్ళనంతా చదవమంది.
కరదీపికైన పుస్తకాన్ని
కనుమరుగుచేసినది.
ఈ-బుక్కుచూసిచూసి
కనులంతా మసకలాయే!?
బద్దకమ్ముహెచ్చిపోయే
మతిమరుపు వరమాయే.
మంచిచెడ్డలు అన్ని చూపు టక్కులాడే ఈ చరవాణి.
రాత్రికిరాత్రే సెలెబ్రిటీని చేయు
మంత్రగత్తే చరవాణి.
పేపర్ లెస్ ఎగ్జామ్స్ కోసం
ఆన్లైన్ పరీక్షలొచ్చే.
పారదర్శకత జవాబుదారీతనం కోసం మంటూ తెగగప్పాలు కొట్టుకొనిరి.
కంప్యూటర్ వైరస్ సోకెనా సమాచారమంత కనుమరుగు.
మ్యాన్వల్ (పుస్తకాన్ని)ను మించినట్టిది,
ఈ చరవాణికానేకాదు.
పుస్తకమ్మే హస్తభూషణం
కంటికిదే వ్యాయామం,ఆరోగ్యప్రదము.
రకరకాల యాప్ లతో వలవేసి
మనలను లాగింది.
దానిబానిసగ మనల మార్చి
ఆన్లైన్లో నిన్ను ముంచి గ్లోబల్ మార్కెట్ లోకి నడిపే
వగల మారిదీ చరవాణి.
జాగ్రత్త, జాగ్రత్త
బ్రతుకుతో ముడిబడ్డ ఆన్లైన్
కోచింగ్, షాపింగ్, పార్సిల్ డోర్ డెలివరీలు
కూర్చున్న చోటికే అన్నిసమకూర్చే సహచరే ఈ చరవాణి.
వాడినోడికివాడినంతా!
తప్పుదోవ పట్టించే మాయాబజారును తలపించే
సోగసుగత్తే ఈ చరవాణి.
బ్లూస్క్రీన్ కు బానిసవకు
పుస్తకాన్ని గిరవాటేయకు!?
ప్రాచీన కాలపు తాళపత్ర గ్రంథాలు
అటుపిమ్మట పుస్తకాలు
ఆధునిక కాలంలో ఈ స్మార్ట్‌బుక్క్స్
పాతరేసెను పుస్తకాన్ని,
జ్ఞానలేమితో మన బ్రతుకులాయేదుర్భరం.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి