ఆదిభిక్షువు:- అంకాల సోమయ్య-దేవరుప్పుల-జనగామ-9640748497
ఆదిభిక్షువతడు
లోకపాలకుడతడు
మాయమర్మమెరుగని
బోళాశంకరుడతడు

ఫలమో పుష్పమో
తోయమోసగినను
పొంగివరమోసంగు
భక్తవరదుడు శంభుడు

కైలాసశిఖర నివాసి
ఉమాపతియే తాను
ఉమామహేశ్వరుండు

శిరమునగంగనుదాల్చినోడు
తనువున అర్థభాగమిచ్చినోడు
అర్థనారీశ్వరుడీ ఈశ్వరయ్య

పార్వతీ వల్లభుడు
పరమపావనమూర్తి
ప్రమద గుణాలకధిపతి
జంగమాదేవరా
లింగమేశ్వరుడు
ముక్కంటి శంకరుడు

మహాభక్తశిఖామణులు
గొడగూచి కన్నప్ప
భక్తశిరియాల
మార్కండేయుల
కాచి పూర్ణాఆయుష్షునొసగిన
దేవాది దేవుడు
భక్తవత్సలుడు
హరహర మహాదేవ శంభో శంకర...

ఓం నమః శివాయ 
భక్తకోటి 
నోట ధ్వనించు
ఏకైక మంత్రము
ముక్తి మార్గము చూపు
దివ్యమంత్రరాజం

పశుపతి పరమేశ
గిరిజా మనోహర
భీమేశ్వర కాళేశ్వర
సోమనాథేశ్వర
శ్రీశైల మల్లీశ్వర
వైద్యనాథేశ్వర
మంజునాథ
రక్ష రక్ష స్వామి 
కడతేర్చు శివయ్య
మాపాపాలన్నియు
ఇష్టంతో మ్రొక్కితిమయ్య
మాయిష్టదైవమా...


కామెంట్‌లు