ఆటవెలది పద్యసుమాలు :- అంకాల సోమయ్య-దేవరుప్పుల-జనగామ-9640748497
1)నిద్రపోవుపులినిర్మలమైయుండు
నిద్రమేలుకొనిన నిజముతెలియు
మంచి మమతచూపుమనుషులే మాన్యులు
వినుము సోదరుండ వీరభద్ర

2)పచ్చనోట్లజూసిపవరును జూసియు
చెడ్డవాడిచెంతచేరవలదు
మమతచూపువారే మహనీయులౌదురు
వినుము సోదరుండ వీరభద్ర

కామెంట్‌లు