నీలో నువ్వు నీతో నువ్వు (ఆత్మావలోకనం):- అంకాల సోమయ్య-దేవరుప్పుల-జనగామ-9640748497
జీవితం నువ్వనుకున్నట్టు 
ఎప్పుడు ఉండదు
ఎత్తు పల్లాలు
ఉత్థాన పతనాలు
సహజాతి సహజాలు
సాధించగలననే ఆత్మవిశ్వాసం ఉండాలి

కానీ
పరాజయం ఎదురైనప్పుడు
క్రుంగిపోకూడదు
నువ్వు చేసిన తప్పులను
ఒకసారి పునఃపరిశీలన చేసుకో
ఈసారి లక్ష్యాన్ని ఖచ్చితంగా చేధిస్తావు

నీ చుట్టూ ఉండే సమాజం
నువ్వు గెలిచిన ప్రతీసారి నీ పతనాన్నే కోరుకుంది
అది సమాజసహజగుణం
అని
తలపోయాలి తప్పా
తలవంచుకొని గులాంగిరీచేయోద్దు

కలలు కను సాకారం చేసుకో
నిరంతర సాధనే విజయసూత్రమనునది మరువొద్దు
నిరాశ నిస్పృహలు నిన్ను చుట్టూ ముట్టినప్పుడు
ఆశాదీపం వెలిగించు
అకుంఠిత దీక్ష తత్పరతతో సాధించు

బ్రతుకు పై ఆందోళన వద్దు
ఉన్నంతలో సంతృప్తిగా జీవించడం
నేర్చుకో
సంకల్పాలు నెరవేర్చే
ఏకైక సాధనం
అలుపెరుగని పోరాటమే

కామెంట్‌లు