మిన్ను కరుణిస్తే మన్ను వరమిస్తే
భూతలమంతా పచ్చదనం
ప్రాణవాయువునిండా స్వచ్ఛదనం
మట్టిని నమ్ముకున్నోడు అన్నదాత
మనిషిని నమ్మిచెడుతున్నాడు
నకిలీ విత్తనాలు కల్తీఎరువులతో
మోసపోతున్నాడు
బురదనుండి బువ్వ దిసినోడు.
బోర్డు తిప్పేసిన సీడ్ కంపెనీలు
కర్మగ్రహచారమంటు తనను తానే నిందించుకునే కృషీవలుడు.
అర్రుగాలం కష్టించి
పండించిన పంటకు
గిట్టుబాటు ధర లేక
అప్పుల కత్తిమెడమీద వ్రేలాడుతున్న వైనం.
వ్యయం తప్పా !?
సాయమెరుగని వ్యవసాయం.
మరో పని చేతగాకా
భూమిని నమ్ముకున్న కర్మానికీ
ఫలసాయమేలేకా...!?
అప్పు గుండెలమీద కుంపటై ఉరికొయ్యకేలాడుతూ...
బలవన్మరణం చెందుతున్న రైతన్నలు..
ఇకనైనా మేల్కొందాం!!
వ్యవసాయం దండగకాదు
పండుగ అని నిరూపిద్దాం!
ఎద్దేడ్చిన వ్యవసాయం!
రైతేడ్చిన రాజ్యంబాగుపడదు!
అన్నదాతలకు ఆగ్రహం రాకుండా చూసుకుందాం!
ఆగ్రహించి క్రాప్ హాలిడే ప్రకటిస్తే
అన్నమో రామచంద్ర అని మనం అలమటించకతప్పదు
అందుకే మనమంతా ఒక్కటై
నినదిద్దాం!
అన్నదాత సుఖీభవ అని...!?
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి