భారపుబ్రతుకులు:- అంకాల సోమయ్య-దేవరుప్పుల-జనగామ-9640748497
ఏ ఆదెరువులేని రైల్వే కూలీలం
 మాశ్రమేమాపెట్టుబడి
కాళ్ళు రెక్కలే మా ఆస్తి పాస్తులు

బరువుతో దిగిన ప్రతీ ప్రయాణికులు
కూలీ వాళ్ళను పిలుస్తారన్న
గ్యారంటీ లేదు

లేవలేని స్థితిలో ఉన్న వాళ్ళు తప్పితే మాకు పనిచూపేవారే కరువు

నెత్తిన సూటికేసు
కుడి ఎడమ భుజాలపై 
లగేజీ బ్యాగులు
భారమైన మోయకతప్పదు 
గమ్యం చేర్చాక
అమ్మ బాపు అని యాచించకతప్పదు
నిత్యం ప్లాట్ ఫామ్ పై అటూఇటూ తిరుగుతూ 
కూలీ కూలీ అనిఅంటూ గొంతు బొంగురు పోయేలా అరవకతప్పదు

మేమేమి పాపం చేస్తిమో!?
పొట్టకూటికే ఇంత తండ్లాట

మాకూలీబ్రతుకులకు తోడు అధికసంతానం

ఏలికలు మమ్ము ఆదుకోరు

వారు మావంకచూడనైనచూడరు
నికరమైన వేతనం నెలనెలా వచ్చేది లేదు

ఒక్కోసారి బరువువెక్కువై 
ఎటోదిక్కు మ్రోగ్గితిమా..
 బొక్కబోర్లా పడితే
ఇక మేము వెళ్ళాల్సింది కాటికే...

రోజు రోజు బరువులు మోస్తేనే
బువ్వ...
లేకుంటే పస్తులే...
ఒంట్లో సుస్తీగా ఉంటే ఆరోజు కూలీకి డుమ్మే
ఇంటిల్లిపాదీకి ఉపాసమే!?

అతిగతీలేని బ్రతుకులు మావి
అసంతృప్తితో....
అంథకారంతో ఎలాగో అలా
 బ్రతుకేస్తున్నాం.
చచ్చే దాకా బ్రతకాలి కదా!?..


కామెంట్‌లు