ప్రజాస్వామ్యమా---!? ఏది నీ చిరునామా!?:- అంకాల సోమయ్య-దేవరుప్పుల-జనగామ-9640748497
నేతాశ్రీలది
అంతా హడావుడి 
ఎప్పుడూ ఏదో చేస్తున్నట్టు
బిల్డప్ లు 

మానవాళి అభివృద్ధి అంతా...
మాపాలనలోనే జరిగిందనే
ప్రగల్భాలు

మసిపూసి మారేడు కాయ చేస్తున్న మన ఏలికలు

ఏం మారింది?
 గరీబోడు
గరీబోనిలెక్కనే ఉన్నడు!
మధ్యతరగతోడు పేదరికంలోకి
జారిపోతున్నడు...!?

బాధల్లో ఉన్నోడికి ఓదార్పులేదిక్కడ?!
మనుషులు సాటి మనుషులను 
ఆదరించలేని స్వార్థపరత్వం

ఎన్నికల్లో నోట్లిచ్చి
ఓట్లు కొనుగోలు చేస్తున్నారు
అధికారం చేపట్టిన నేత
తన విశ్వరూపం చూపుతున్నాడు

పల్లెల్లో పచ్చదనం పరిశుభ్రత కరువు
పట్టణాల్లో కనీస వసతులు కల్పించరు
అడుగంటి పోతున్న భూగర్భ జలాలు
వీధి వీధిలో వెలసిన సీసీ రోడ్లు

చెరువులు కుంటలు వాగులు వంకలు
కొండా కోనలు అడవులు
రియాల్టర్ల కన్నుపడి
వెంచర్లు గా మారిపోయిన వైనం

పేదోడికి నిలువనీడనివ్వలేని
ప్రజాస్వామ్యం మనది
అడుగడుగునా అవినీతి, ప్రజావ్యతిరేక 
విధానాలతో బ్రతుకు బరువై
చావుకు దగ్గరవుతున్న జనబాహుళ్యం

కామెంట్‌లు