కం.
మత్తును వీడుము సోదర
మత్తెక్కిననీ బ్రతుకుయె మంటన కలియున్
చిత్తైపోవును జీవన
చిత్తం బే మారిపోవు చిత్రం బుగనన్
కం.
ఇల్లే గుల్లయి పోవును
పిల్లల భవితవ్యమంత పేలగ మారున్
మళ్ళీ రాదుగ కాలమె
కల్లగ మారును బ్రతుకుయె గండము నగుచున్
కం.
నీవే జీవన చక్రము
నీవే నీయింటి వెలుగు నీవే బ్రతుకౌ
నీవే మత్తును వీడిన
నీవే సంతసమవుదువు నీవాళ్ళకునన్
కం.
మత్తే స్వర్గం బనకుము
మత్తే నరకంబుజేయు మనుజులనెపుడున్
మత్తుకు బానిస వైనను
చిత్తౌ నీజీవనంబు చింతగ మారున్.
మత్తును వీడుము సోదర
మత్తెక్కిననీ బ్రతుకుయె మంటన కలియున్
చిత్తైపోవును జీవన
చిత్తం బే మారిపోవు చిత్రం బుగనన్
కం.
ఇల్లే గుల్లయి పోవును
పిల్లల భవితవ్యమంత పేలగ మారున్
మళ్ళీ రాదుగ కాలమె
కల్లగ మారును బ్రతుకుయె గండము నగుచున్
కం.
నీవే జీవన చక్రము
నీవే నీయింటి వెలుగు నీవే బ్రతుకౌ
నీవే మత్తును వీడిన
నీవే సంతసమవుదువు నీవాళ్ళకునన్
కం.
మత్తే స్వర్గం బనకుము
మత్తే నరకంబుజేయు మనుజులనెపుడున్
మత్తుకు బానిస వైనను
చిత్తౌ నీజీవనంబు చింతగ మారున్.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి