ఊరుగాలి ఈల 97;- డా.టి.రాధాకృష్ణమాచార్యులు
బంధాల అందాలే సుమగంధాలు వినే పాటేఊరు
సుందర సౌధం మనసే ఊరించే నీడ చేట్టేగా పల్లె
కుంజరయూధం దోమలేదు స్వేచ్ఛ మెరిసే ఊరు

ఎవరు మీరు ప్రశ్నే ఊరోళ్ళగానం చెట్లే మెట్లనడక
ఆకాశవీధి జాబిలిఅందాలే వొయ్యారితారను జేరే
సరసమే ప్రేమమీర రసమై ఊరేగే బతుకు దెరువు

గూడు గుడిసే గుండెనిండా వాకిలిపల్లె  స్కైవాక్ సీ
ఏమిదయ ఎంతకృప మనిషీ!నేనే పూచే పల్లెలోన
రోడ్డెక్కని మనిషి స్టైక్ కదలని రాక్ బస్సు ఊరేరన్

ఆట మొదలైతే ఫలితం వచ్చు ఆగనిదే ఊరుపదా
ఆకు ఊపేగాలి అలికిడి సడిచేయకు సీ ఊంజాల్
నొప్పితలది బాధమదికే పల్లెజీవి ఎదపాటే చికిత్స

దూపకు ఆకలికి తీర్థం ప్రసాదం భక్తీభుక్తి ఊరువే
చెమటలో ఊరు చెలిమె చెలిమిలో నేనే పల్లెసీమ
సీసంలో గీతం సీసా సంగీతం పుట్టిందే ఊరువాడ

తృణచిరుధాన్యాలు ఊరుసిరులు నడకపని భేష్
టిప్స్ గుడ్ బ్లైండ్ బిలిఫ్ నో పల్లేగా రిలీఫ్ రిలాక్స్
భాషలన్నీ పల్లెవే మారిన వేషం మనిషి రంగే నింగి

ఆముదం వంటనూనే ఓషధులే పల్లెల మొదలది
చెరుకు అరుకు తీపి ఆటలపాటే కోరస్ పల్లెప్రవీణ
వీణతీగలు మీటే పాట రాగం బతుకు ఊరునే నే
==================================
(ఇంకా ఉంది)

కామెంట్‌లు