ఒక దండకారణ్యంలో చీమల గుంపు ఉండేది.
అవి ఎటు వెళ్లినా గాని గుంపులు గుంపులుగా అడవి మార్గం గుండా వెళ్ళేవి.
వెళ్లే దారిలో ఒక పెద్ద గుండు రాయి ఉండేది.వాటి ప్రయాణానికి అది చాలా ఇబ్బందిగా మారింది.
అవి అడవికి వెళ్లాలంటే ఆ గుండు చుట్టూ తిరిగేసరికి చాలా సమయం పట్టేది.
కాలం విలువ చీమలకు తెలుసు. కాబట్టి ఆ గుండును ఎలాగైనా తొలగించాలని అనుకున్నాయి.అన్ని చీమలు ఏకమయ్యాయి.తగిన ఆయుధాలతో ప్రయత్నించాయి.
చివరికి పక్కకు తొలగించాయి.
అడవికి వెళ్లడానికి దారి సులభమైంది.ఆవిధంగా అడవి అంత తిరిగి ఆహారాన్ని తీసుకొచ్చేవి.
చీమలు ముందుచూపు కలిగినవి.వర్షాకాలంలో అడవి అంతా నీళ్లు ఉంటాయి. ఆహారాన్ని వెళ్లి సేకరించుకోలేము.ఆహారాన్ని సేకరించి తమ పుట్టలో పొదుపు చేసేవి.
ఈ విషయాలను ఒక పాము గమనించింది.వాటి స్థావరానికి వెళ్ళింది.
అందులో చీమలు పెట్టిన ఆహారం గుట్టలు గుట్టలుగా పడి ఉన్నది.
అప్పుడు పాము ఆలోచించింది.
ఎందుకబ్బా! వీటికి గింత ఆహారం.ఏం చేసుకుంటాయి అని ఆలోచించింది.
పాము రోజు కొంత తినుకుంటూ అందులోనే పడుకుంటుంది. సోమరిగా తయారవుతుంది.
చీమలు ఎంత చెప్పినా కూడా వినడం లేదు.ఎదురు తిరిగిన చీమలపై దాడి చేస్తూ తింటుంది.ఆ విధంగా చీమల సంఖ్య తగ్గిపోసాగింది.
ఆ పాము పీడ ఎలాగైనా వదిలించుకోవాలని అనుకున్నాయి. అవన్నీ ఒక అనుభవం కలిగిన పెద్ద చీమ దగ్గరికి వెళ్ళాయి.పాము యొక్క ఆగడాలని ఆ చీమకు విన్నవించాయి.
అప్పుడు ఆ పెద్ద చీమ మనం ఐక్యంగా ఉన్నంతసేపు ఎవరు మనలను ఏమి చేయలేరు. మనకు అడ్డంకిగా ఉన్న పెద్ద గుండురాయినే తొలగించు కున్నాము.ఇది మనకో లెక్కనా!అని పెద్ద చీమ అనగానే చీమలకు సంతోషమైంది.
మనమందరం గుంపులు గుంపులుగా తయారై ఆ సోమరి పాము పైన దాడి చేస్తాము.
దాని పీడ వదులుతుందని అనుకున్నాయి.
అప్పుడు చీమలన్నీ గుంపులుగా బయలుదేరాయి. ఎటు వెళ్లకుండా పామును నిర్బంధించాయి.
కొన్ని గ్రూపుల చీమలు ఆ పాము పైన దాడి చేస్తూ కొరకసాగాయి.నొప్పి భరించలేక వెళ్లిపోదామనుకుంటే ముందు కూడా కొన్ని చీమలు అడ్డగించాయి.
వెనుకకు పోదాం అంటే అక్కడ చీమల అడగించాయి.చివరికి చేసేదేమీ లేక ప్రాణాలు పోగొట్టుకున్నది.చీమలన్నీ కలిసి ఆ పాము పీడ వదిలించుకున్నాయి.
కలిసి ఉంటే ఎంత పెద్ద పని అయినా సాధించవచ్చని నీతిని తెలుసుకున్నాయి.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి