అవని విముక్తికై ఆరాటపడిన వీరులేందరో
కాలగర్భంలో కలిసిపోయిన వారుచూపెట్టిన వీరత్వం,
ధైర్యం, సాహసం, దేశభక్తి దేశప్రజల నరనరానా
నాటుకుపోయింది.
భగత్ సింగ్ వేసిన స్వాతంత్ర్య బాట,
సుకుదేవు సూపిన ముందు సూపు,
రాజగురు రాజసం, ఆజాద్ ఆత్మ స్థైర్యం
మన దేశప్రజలకు నరనరానా
నాటుకుపోయింది.
పరాయిదేశంలో మనవాళ్ళున్న
వారు చేసే పనిలో నడిచే నడవడికలో
మానవవిలువలు పాటిస్తూ దేశభక్తిని చూపిస్తున్నారు.
మన జాతి ప్రజలు జాతి సేవ చేస్తూనే,
మన జాతి ప్రజలు మానవ సేవ చేస్తూనే
దేశభక్తిని నరనరాన నాటుకున్నారు.
=============================
భైరగోని రామచంద్రం -స్కూల్ అసిస్టెంట్,
తెలుగు -ప్రభుత్వ ఉన్నత పాఠశాల,
రాజ్ భవన్, సోమాజిగూడ, హైదరాబాద్ 500041.
.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి