పరీక్షలు దగ్గర పడ్డాయి. స్కూల్లో రివిజన్స్ జరుగుతున్నాయి. టీచర్లు అందరూ పిల్లలని చదివించడం లో బిజీ అయిపోయారు.
రమేష్, రాజేష్ ,రంజిత్ మంచి స్నేహితులు . రాజేష్ కి చదువు మీద బాగా శ్రద్ధ, రమేష్ ,రంజిత్ ఇద్దరూ ఎప్పుడూ అల్లరి చిల్లరగా తిరుగుతూ పుస్తకాలు అసలు ముట్టుకోరు. రాజేష్ ని వూరికే ఆట పట్టిస్తూ పుస్తకాలు దాచి పెట్టేవాళ్ళు.
బోర్డు పరీక్షలు బాగా చదవమని టీచర్లు గట్టిగా నూరిపొస్తున్నారు.
రాజేష్ ఇంగ్లీష్ , మ్యాథ్స్ పుస్తకాలు రంజిత్ దాచి పెట్టాడు. రమేష్ కి అది తెలుసు. పాపం వద్దురా అని ఎంత చెప్పినా రంజిత్ వినలేదు.
ఇంటికి వెళ్లి తన బాగ్ లో చూస్తే రాజేష్ కి పుస్తకాలు కనిపించలేదు. ఏం చెయ్యాలో తెలియలేదు. రంజిత్ ,రమేష్ లు ఎక్కడున్నారో వెతకడం మొదలు పెట్టాడు.
రమేష్ రంజిత్ ఇద్దరూ చెరువులో ఈత కొడుతూ ఆడుతున్నారు.
రాజేష్ చెరువు దగ్గరకి వెళ్లి వాళ్ళిద్దరినీ పిలిచాడు. నువ్వుకూడా రారా అందరం నీళ్ళల్లో ఆడుదాం అంటూ రాజేష్ మీద నీళ్ళు చల్లుతూ పిలిచారు. వద్దురా పరీక్షలు దగ్గర పడ్డాయి చదువుకుందాం రండిరా అంటూ పిలిచాడు. ఎందుకురా చదువు మనకి మన నాన్న అమ్మ లాగ హాయి గా పొలం లో కూలి చేసుకుందాం. హాయి గా తిరగచ్చు అంటూ రాజేష్ మీద ఇంకా నీళ్ళు చల్లారు.
ఎందుకేంటిరా అమ్మ నాన్న ఎప్పటికీ కూలీలేనా, వాళ్ళని సుఖపెట్టే బాధ్యత మనది కాదా. మనం చదువుకుని పైకి వస్తే అమ్మ నాన్నలు కష్ట పడకుండా మనం చూసుకోవచ్చు. చదువుకుని మనం ఎంతో మందికి ఉపయోగ పడచ్చు. డాక్టర్ ,టీచర్ కలెక్టర్ పోలీసు ఇలా ఎన్నో ఉద్యోగాలు మనం చేసే అవకాశం, చదువుకుంటే వస్తాయి. ఇప్పుడు కష్టపడి చదివితే మనకి మంచి భవిష్యత్తు , అమ్మ నాన్న కి ఆసరా ఉంటుంది.
చదువు ఒక్కటే రా మనని మన కాళ్ళ మీద నిలబెట్టేది. నా మాట వినండిరా. బోర్డు పరీక్షలు బాగా రాసి పాస్ అవుదాం. మనం టీచర్లకు మన స్కూల్ కి మంచి పేరు వస్తుందిరా ,నా మాట వినండి అంటూ గట్టిగా చెప్పాడు రాజేష్.
రంజిత్ రమేష్ కి వాళ్ళ అమ్మ నాన్న ఎంత కష్టపడుతున్నారో కూలీలు గా గుర్తు వచ్చింది.
ఇద్దరు చెరువులోంచి బయటకి వచ్చి , రాజేష్ చేతులు పట్టుకుని సారీ రా నీ పుస్తకాలు మేమే దాచేసాము . మాకు కూడా నువ్వు చదువు చెప్పరా, మేము కూడా పరీక్షలు బాగా రాస్తామంటూ చెప్పారు.
అయితే పదండి అందరం మా ఇంట్లో చదువుకుందాం. మన తరగతి లో మనకే ఎక్కువ మార్కులు రావాలి అంటూ ఇంటి వైపు దారి తీసాడు రాజేష్ . ఒక కొత్త నిర్ణయం తో రాజేష్ భుజం మీద చేతులేసి రంజిత్ ,రమేష్ ముందుకు సాగారు.
చదువే మన జీవితానికి ఒక మార్గం చూపే మార్గదర్శి అని వాళ్ళకి అర్థం అయింది.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి