తెలుగు ఎక్కడ ? .:- డా. బెల్లంకొండ నాగేశ్వరరావు.చెన్నయ్ .-9884429899

 వేగు చుక్క పొడిచే వేళకు కోతిబావ చెట్టు వద్దకు వచ్చిన కుందేలు " అల్లుడు అల్లుడు "అని గట్టిగా పిలిచాడు. " ఏం మామా తెల్లవారకముందే వచ్చావు "అన్నాడు కోతిబావ .
" రాతి నాకు ఒపనస పండు దొరికింది ఇవిగో ఈతొనలు ఈతేనెలో అద్దుకు తిను "అన్నాడు కుందేలుమామ.
" కడుపు పెట్టకుండా నొప్పి నాకు వస్తుంది తింటే " అన్నది పిల్లరామచిలుక .  "మామా ఈ తికమక తెలుగుతో మనల్నిఈపిల్లరామ చిలుక చావగొడుతుంది " అన్నాడు కోతి.
" నీకు పెట్టకుండా తింటే కడుపు నొప్పివస్తుందా ? ఒకరికి పెట్టకుండా ఒంటరిగా ఎప్పుడూ తినకూడదు  ఇదిగో తేనె అద్దిన పనస తొన " అని పిల్లరామచిలుకకు  అందించాడు కుందేలు.
" మామా మన తెలుగులోనే కొన్నింటిలో  తెలుగు పదాలు లేనివి ఆంగ్ల పదాలు ఉన్నవి  ఉదాహరణకు పోస్టాఫీస్ తీసుకుందాం! పోస్టుబాక్స,పోస్టుమేన్ ,స్టాంపు,కార్టు,ఇన్ లాండ్ కవరు, ఎన్ లెపె కవర్ ,యంఓ.,పోస్టుమాస్టర్ ,రిజస్టర్ పోస్టు,పార్సిల్ ,సేవింగ్ ఎకౌంట్ ,ఫిక్స్ డ్ డిపాజిట్ ఇలా ఆంతటా ఆంగ్లపదాలే! తెలుగు ఎక్కడా?.
మరో ఉదాహరణ రైల్వే ష్టేషన్ , టిక్కెట్ ,బుకింగ్ ,ఫ్లాట్ ఫాంమ్, ట్రయిన్ , సిగ్నెల్ ,టి సి,గార్డు,డ్రవర్ ,సీటు, రిజర్వేషన్ ఇలా ఆంగ్లపదాల అంతటా ఆక్రమించుకున్నాయి.
మరో ఉదాహరణ బస్ స్టాండ్ బస్ , డ్రవర్ ,కండక్టర్ ,టికెట్ ,స్టేజి, రోడ్ ,బస్ డిపో ,చెకింగ్ ,ఫుల్ టికెట్ ,ఆఫ్ టికెట్ ,రిజర్వేషన్ ,ఆర్డనరి,సూపర్ ఫాస్ట,సెమిలగ్జరి, ఏ సి బస్ , సిటిబస్ ఇలా అన్నింట ఆంగ్లమే వినిపిస్తుంది.
మరో ఉదాహరణ జనరల్ హస్పెటల్ ,ఓ పి, డాక్టర్ ,నర్స్ ,ఎక్స్ రే, స్కాన్ ,బ్లడ్ టెస్టు, ఇంజెక్షన్ ,టాబెలెట్ ఇలా దాదాపు పది వేల  ఆంగ్లపదాలు తెలుగులో అన్నింట మనకు తిష్టవేసి కనిపిస్తాయి. 
బ్యాంక్ లో కూడా ఇదే తతగం.
ఇవికాకుండా ఉర్దు, సంస్క్రత పదాలుకూడా తెలుగు భాష వాడుకలో ఉన్నాయి" అన్నాడు కోతి.
" చెన్నయ్ నగర మేయర్ ఈసమస్య పరిష్కరించడానికి ఆరువందల ఇంగ్లీషు పదాలకు తమిళ తర్జుమా చేయించి చెన్నయ్ నగర నామఫలకాలు ( బోర్డులు) పై రాయించాడు అలాచేయనీ దుకాణదారులకు జరిమాన విధించారు " అన్నది తల్లి రామచిలుక.
" నిజమే ఈభాషా సమస్యను అన్నిరాష్ట్రాల ప్రజలు అనుభవిస్తున్నారు. ప్రతిపక్షం,పాలకపక్షం ఈసమస్యపై దృష్టి నిలపాలి. గ భాషా పండితులను,భాషా ప్రేమికులను ప్రోత్సహించాలి ఆంగ్లపదాలకు ధీటుగా తెలుగు పదాలు సృష్టింపబడాలి ,తల్లితండ్రి తోపాటుగా పాఠశాలల్లో కూడా మాతృభాషను ప్రోత్సహించాలి అప్పుడే మనభాషకు వన్నె వస్తుంది " అన్నాడు కుందేలు.

కామెంట్‌లు