పసివారు వేల్పులు:- --గద్వాల సోమన్న ,9966414580
పాలలాంటి ప్రాయము
పూలలాంటి స్వభావము
చిన్నారులకున్నది
వెన్నలాంటి హృదయము

పల్లెసీమ అందము
వల్లి వంటి బంధము
పిల్లలలో ఉన్నది
మల్లెలాంటి పరిమళము

మితిమీరిన ద్వేషము
లేదు మదిని దోషము
బాలలలో ఉన్నది
పవిత్రమైన స్నేహము

ఉందోయ్! మంచితనము
లేదోయ్! చెడ్డ గుణము
పసి పిల్లలు దూతలు
ప్రేమ పంచు దాతలు

ఉండు నోట సత్యము
పలుకుతారు నిత్యము
వారుంటే కళకళ
తారల్లా మిలమిల

ప్రవహించే యేరులు
విహరించే ఖగములు
చిన్నారులు వేల్పులు
ఉదయించే భానులు


కామెంట్‌లు