సంకల్పంతో సాధ్యమే!:- --గద్వాల సోమన్న ,9966414580
దృఢ సంకల్పముంటే
ఏదైనా సాధ్యమే!
భగీరథ యత్నంతో
అడుగడుగునా విజయమే!

భూమి పొరలు చీల్చుకొచ్చే
విత్తు మనకు ఆదర్శము
చీకటిని తరిమికొట్టే
రవి కిరణం సందేశము

బండలనూ, కొండలనూ
పెకిలించే మొక్క మనకు
మిగుల స్ఫూర్తిదాయకము
కడు ఆచరణ యోగ్యము

ప్రయత్నించి  చూస్తేనే
లోతుపాతులు తెలిసేది
అడుగుముందుకేస్తేనే
గమ్యం చేరువయ్యేది

కఠిన శిలలోంచి బయటకు
వచ్చిన చెట్టును తిలకించు
దానికున్న పట్టుదల
ఇకనైనా స్వాగతించు

ప్రకృతి నేర్పును పాఠాలు
చెప్పకనే చెప్పునోయి!
అమూల్య జీవిత సత్యాలు
అవసరమైన విషయాలు


కామెంట్‌లు