చదువే ముఖ్యము:- --గద్వాల సోమన్న ,9966414580
చదువెంతో  ముఖ్యము
పంచునెంతో హాయి
చేస్తుంది జీవితము
పండు వెన్నెల రేయి

చదువిచ్చును సౌఖ్యము
ప్రసాదించు భాగ్యము
తరుమును అజ్ఞానము
పెంచును విజ్ఞానము

మార్చునోయ్! తలరాత
చదువుకో! అంచేత
చదువుకుంది ఘన పాత్ర
సృష్టించును చరిత్ర

శక్తి ఉన్నది చదువు
విజ్ఞానానికి నెలవు
చదువుకుంటే మాత్రము
మేలులెన్నో కలవు

అందరూ చదవాలి
బ్రతుకులో గెలవాలి
విజ్ఞానవంతులై
దేశ ఘనత నిలపాలి

చదువు మూల బిందువు
అందరికీ బంధువు
విజ్ఞానపు సింధువు
మిత్రమా! ఏమందువు!


కామెంట్‌లు