తల్లి హితోపదేశం:- --గద్వాల సోమన్న ,9966414580
మేలిమి వ్యక్తిత్వము
పెంచును ఔన్నత్యము
తెచ్చును సమాజాన
ఎనలేని గౌరవము

సతతము శత్రుత్వము
కాదు కాదు క్షేమము
శ్రేష్టమైన స్నేహము
విలువైన కుందనము

మేటి మనస్తత్వము
బ్రతుకులో శుభకరము
పెంచుకున్న లాభము
ఉండదోయి! నష్టము

గొప్పది దైవత్వము
చెరువు దానవత్వము
అన్నింటి కన్న మిన్న
మదిని మానవత్వము


కామెంట్‌లు