అమ్మలాంటి తెలుగు పదాలు:- --గద్వాల సోమన్న ,9966414680
చిరుగాలి వీచింది
మరుమల్లె విరిసింది
కనువిందు చేసింది
మేను పులకించింది

విరిజాజి నవ్వింది
హరివిల్లు వెలసింది
సప్త వర్ణాలతో
హృదయాలు దోచింది

శశి వోలె పసిపాప
ముద్దుగా తోచింది
వెన్నెలమ్మ వెలుగై
చీకటిని తరిమింది

ఇంటిలో మా అమ్మ
ముద్దలే చేసింది
చందమామను చూపి
బొజ్జలే నింపింది


కామెంట్‌లు